బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలె విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక 6వ సీజన్ ప్రారంభానికి మరికొద్దిరోజుల సమయం ఉండగా తాను రెండు నెలల వ్యవధిలో తిరిగి షోలోకి వస్తానని, అయితే వేరే ఫార్మాట్లో ఉంటుందని చెప్పిన నాగ్…ఆ మాటను నిలబెట్టుకున్నాడు. సాధారణంగా మరో సీజన్‌ను ప్రారంభించడానికి ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి నేను కొత్త ఫార్మాట్లో కేవలం రెండు నెలల్లో తిరిగి వస్తాను చెప్పిన నాగార్జున…తొలి సీజన్ ఫిబ్రవరి 26న ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ 24*7 షోను ప్రసారం చేస్తుండగా ఈ ఫార్మాట్లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గ్రాండ్ లాంచ్ కోసం టీమ్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ OTTలో పాత, కొత్త హౌస్మేట్స్ కనిపించనున్నారు. ఈ షో దాదాపు 84 రోజుల పాటు కొనసాగనుంది.