బిగ్ బాస్ 5..ఈ వారం నామినేషన్స్‌లో ఉంది వీరే!

100
bb5
- Advertisement -

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ 5 విజయవంతగా 9 వలోకి అడుగుపెట్టగా ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఇంటి నుంచి బయటకు పంపడానికి ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దర్ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలను తెలియజేసి నామినేట్ చేయాలనుకున్న సభ్యుడి ముఖంపై తెల్లటి క్రీమ్‌ని పూయాలని చెప్పారు. షణ్ముఖ్ ఇంటి కెప్టెన్ కావడంతో అతన్ని నామినేట్ చేయడానికి వీళ్లేదని చెప్పగా తొలుత మానస్‌ మొదలు పెట్టారు.

మానస్.. శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేశాడు. సిరి.. సన్నీ, ఆనీ మాస్టర్‌లను నామినేట్ చేసింది. తర్వాత శ్రీరామ్.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేయగా సన్నీ కోపాన్ని అనుచుకోలేకపోతున్నాడని, నాతో నీకు ప్రాబ్లమ్ ఏంటో అర్ధం కావడం లేదని మానస్‌ని నామినేట్ చేశారు.

రవి.. మానస్, కాజల్‌లను నామినేట్ చేయగా జెస్సీ.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. సన్నీ లెగ్‌తో నన్ను తన్నడం నచ్చలేదని తెలిపాడు. ఇక ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేయగా సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు. సిరి తన ఫ్రెండ్ కోసం స్ట్రాండ్ తీసుకున్నట్టే నేను నా ఫ్రెండ్ కోసం స్ట్రాండ్ తీసుకున్నా. నా ప్రవర్తన నీకు నచ్చలేదని అంటున్నావ్.. నేను అరిచానప్పుడు జెస్సీ కూడా అరిచాడు దాన్ని నువ్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పాడు.

ఇక విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్ చేయగా కాజల్.. రవి, శ్రీరామ చంద్రలను నామినేట్ చేసింది. తర్వాత ఆనీ మాస్టర్.. సిరి, కాజల్‌లను నామినేట్ చేయగా షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఇక నామినేషన్స్ ముగిసిన తర్వాత సిరి మళ్లీ సన్నీని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. సన్నీ నిన్ను నామినేట్ చేసింది హెల్త్ గురించి అలా మాట్లాడావని.. అంతే తప్ప జెస్సీ హెల్త్ గురించి కాదు అని నామినేషన్స్ ప్లేస్‌లోకి వచ్చి చెప్పింది. దీంతో సన్నీ సమాధానం ఇస్తూ.. నేను అరుస్తున్నానని జెస్సీ కూడా అరిచాడు. నామినేషన్స్ అయిపోయిన తరువాత మళ్లీ ఈ గొడవ ఏంటి అని మానస్ సన్నీతో అనగా.. సిరి కావాలనే తీసింది హైలైట్ అవ్వాలిగా అని అనగా ఈ మాట విన్న సిరి…సన్నీతో మాటల యుద్దానికి దిగింది.

ఇక చివరగా 9వ వారం నామినేషన్స్‌లో భాగంగా మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ ఒక్కడికే మినహాయింపు ఇచ్చారు.

- Advertisement -