బిగ్ బాస్4: దివిపై కోపంతో ఊగిపోయిన సోహైల్..

254
bigg boss 4

బిగ్ బాస్ హౌస్‌లో నాలుగోవారం నామినేషన్ వచ్చేసింది.. సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ వేడి ఉండటంతో ఇంటి సభ్యులు అసలు రూపం బయటపడుతూ ఉంటుంది. టాస్క్‌లో నెగ్గేందుకు ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లోనూ మాటల తూటాలు పేలాయి. దివి, సోహైల్ మధ్య గొడవ జరిగింది. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

ఇవాళ హౌస్ మేట్స్‌కు ‘డిస్క్ పకడో’ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పై నుంచి పడుతున్న డిస్క్‌లు అందరూ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దివిపై సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ”సోహైల్ అందరినీ కొట్టేస్తాడు..నువ్వు జాగ్రత్తగా డిస్క్‌లను పెట్టుకో” అని అరియానాకు దివి సూచిస్తుంది. దాంతో కోపంతో ఊగిపోయిన సోహైల్.. ‘దొంగతనం చేసింది.. నువ్వు” అంటూ మండిపడతాడు. అందరు దొంగలే ఇక్కడ.. గేమ్‌ను గేమ్‌లా ఆడాలని స్పష్టం చేస్తాడు. నేను ఫెయిర్‌గానే ఆడుతున్నాంటూ దివి కూడా రెచ్చిపోయింది.

మరి డిస్క్ పకడో టాస్క్‌లో ఎవరు దొంగలు, ఎవరు ఫెయిర్‌గా ఆడారో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు సోహైల్‌పై మండిపడుతున్నారు. మరీ అంత కోపం అవసరం లేదని.. కొంచెం తగ్గించుకుటే మంచిదని..సెటైర్లు వేస్తున్నారు.