బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 99 హైలైట్స్

214
epeisode 99
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 99 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 99వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ కాగా ఫైనల్‌కు వెళ్లే ఐదుగురు సభ్యులు ఎవరో తెలిసిపోయింది.

సన్ డే ఫన్‌ డేలో భాగంగా ఇంటి సభ్యులను ఎమోషన్‌తో మాట్లాడించే ప్రయత్నం చేశారు నాగ్. బిగ్ బాస్ ప్రైజ్‌మ‌నీ రూ.50 ల‌క్ష‌ల‌ని … ట్రోఫీ గెలిచి ఈ డబ్బు మీ సొంత‌మ‌వుతే ఏం చేస్తార‌ని నాగ్ ప్ర‌శ్నించారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలిపారు. తొలుత హారిక తనకు ఒక్క రూపాయి వ‌ద్దు, అన్నీ అమ్మ‌కే ఇస్తాన‌ని హారిక చెప్పుకొచ్చింది. ఈ డ‌బ్బుల‌తో ఒక ఇల్లు క‌ట్టుకుంటాను. మా ఊరిలో పొలం కోసం రూ.50,000 అప్పు చేసిన‌ ఐదారుగురి రుణాన్ని తీర్చేస్తాన‌ని అరియానా తెలిపింది.

తాను డ‌బ్బు గెలిస్తే దాన్ని నాన్న‌కే ఇచ్చేస్తానని అభిజిత్ తెలపగా మోనాల్ తన కోసం కష్టపడిన అమ్మకే ఈ డబ్బు అంతా ఇచ్చేస్తానని తెలిపింది. ఇక అఖిల్ ఓల్డేజ్ హోమ్ వాళ్ల‌కు కొంత డ‌బ్బు ఇస్తాను. వీలైతే ఓ ఇల్లు కొనుక్కుంటా అలాగే ఒక కెఫె పెడ‌తాను అని తెలిపాడు. తాను కెఫె పెడితే త‌ప్ప‌కుండా రావాల‌ని నాగార్జున‌ను కోరగా వస్తానని మాటిచ్చాడు నాగ్. ఇక సోహైల్ నా అకౌంట్‌లో ఎప్పుడూ ల‌క్ష‌కు మించి లేవు. అవ‌స‌రంలో ఉన్న‌వారి కోసం రూ.10 ల‌క్ష‌లు ప‌క్క‌న పెడ‌తాను. ఓ ఫ్లాట్ కొంటాను అని చెప్పుకొచ్చాడు.

తర్వాత ఇంటి సభ్యులు గెలిస్తే ఎలా ఉంటుందో చెప్పాలని ఒక్కొక్కరితో మాట్లాడించారు నాగ్. హారిక..మోనాల్‌ గెలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించగా అరియానా.. అభిజిత్‌, అభిజిత్‌.. అఖిల్‌, మోనాల్‌.. సోహైల్‌, అఖిల్‌.. అరియానా, సోహైల్‌.. హారికను ఇమిటేట్ చేస్తూ వారి విన్నింగ్ స్పీచ్ ఇచ్చి న‌వ్వించారు.

ఇక మూడో ఫైనలిస్ట్‌గా అభిజిత్,నాలుగో ఫైనలిస్ట్‌గా హారిక వెళ్లగా మిగిలింది అరియానా,మోనాల్. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలిపిన నాగ్ ..కాసేపు ట్విస్ట్ అనంతరం అరియానా ఫైనల్లోకి అడుగుపెట్టిందని తెలిపారు. దీంతో అఖిల్‌ షాక్‌లోకి వెళ్లిపోగా కంటతడి పెట్టుకుంటూ హౌస్‌ నుండి వెళ్లిపోయింది మోనాల్. అనంత‌రం టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్‌, సోహైల్‌, అభిజిత్‌, హారిక‌, అరియానా ఫైన‌ల్‌లో అడుగుపెట్టినందుకు చిందేస్తూ పార్టీ చేసుకున్నారు.

- Advertisement -