బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 100వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకోగా ఒక్కొక్కరు తాము ఎందుకు టైటిల్‌కు అర్హులో ఇతరులు ఎందుకు కాదో తెలపగా అఖిల్..మోనాల్ లేకపోవడంతో బాధపడుతూ కూర్చున్నాడు.
మోనాల్ తలుచుకుని బిగ్ బాస్ కెమెరాల ముందు తెగబాధపడిపోయాడు అఖిల్. నా గుండె చాలా భారంగా ఉంది.. నా వల్ల కావడం లేదు….తట్టుకోలేకపోతున్నా,అన్నీ లోపల పెట్టుకుంటే బ్రేక్ అవుతాననే భయంతో భయటకు మాట్లాడేస్తున్నా అన్నాడు అఖిల్. తర్వాత హారికతో ఆ పర్సన్‌తో మాట్లాడకపోయినా.. ఆ పర్సన్ ఉంటే చాలని అనిపిస్తుందని అనగా రారా.. నువ్ మోనాల్‌ని బాగా మిస్ అవుతున్నావ్ అని అర్థమౌతుంది అని తెలిపింది.
తర్వాత బిగ్ బాస్ విజేత కావడానికి మీరే ఎందుకు అర్హులో తెలియజేస్తూ.. విజేత కావడానికి అర్హతలేని ఒక సభ్యుడ్ని ఎంచుకుని సరైన కారణాలను తెలియజేయాలని చెప్పారు బిగ్ బాస్.తొలుత అభిజిత్ మాట్లాడుతూ.. మీ అందరికంటే నేను ఎక్కువ సార్లు నేను నామినేట్ అయ్యా.. నేను విజేతను అవుతానని అనుకుంటున్నా అని తెలపగా హారిక ఎక్కడో లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది అంటూ రీజన్ చెప్పాడు.
తర్వాత అఖిల్ మాట్లాడుతూ.. నేనే విన్నర్‌ని.. నాకే అర్హత ఉందని చెబుతూ ఇక అరియానాకి టైటిల్ గెలిచే అర్హత లేదని చెప్పాడు. సొహైల్ మాట్లాడుతూ.. దిల్, మైండ్ బ్యాలెన్స్ చేస్తూ గేమ్ ఆడా అందుకే నేనే టైటిల్ విజేతని అని తెలపగా అరియానాని అనర్హురాలిగా చెప్పాడు సొహైల్.హారిక మాట్లాడుతూ.. నేను కత్తిని,పూవుని వాడా.. రెండింటినీ బ్యాలెన్స్ చేశా అందుకే నేనే విజేతని అని తెలపగా అరియానాను అనర్హురాలిగా తెలిపింది హారిక.
చివరగా అరియానా మాట్లాడుతూ…నామినేషన్స్ అప్పుడు నేనే అనర్హురాలిని అని అంటారు.. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారంటే దాన్ని బట్టి తెలుస్తోంది నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలుస్తోంది. అందుకే నేను టైటిల్ తీసుకోవడానికి అర్హురాలినని చెప్పింది. ఇక హారికను అనర్హురాలిగా ప్రకటించింది అరియానా. మొత్తంగా ఈ అర్హత, అనర్హత టాస్క్‌లో అరియానా, హారిక ఇద్దరు మహిళా కంటెస్టెంట్‌లు మాత్రమే అనర్హులుగా తేలారు.