అఖిల్ వర్సెస్ అమ్మా…రచ్చ రచ్చ!

204
amma rajasekhar

బిగ్ బాస్ తెలుగు 51వ ఎపిసోడ్ ఎలిమినేషన్ ఆసక్తికరంగా సాగింది. సోమవారం నామినేషన్ ఎపిసోడ్ కావడంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పారు. దీంతో అఖిల్- రాజశేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అమ్మా రాజశేఖర్.. అఖిల్‌ని నామినేట్ చేస్తూ.. మోనాల్ ఇష్యూని లేవనెత్తడంతో రచ్చ రేగింది. అభిజిత్‌తో గొడవైన తరువాత మోనాల్ మాట్లాడటం మానేసినా అఖిల్ మరింత దగ్గర కావడం తనకు నచ్చలేదని రాజశేఖర్ మాస్టర్ అనడంతో.. మోనాల్ కోసం నేను ఇక్కడకు రాలేదు.. మేం ఇద్దరం కలిసి బిగ్ బాస్ హౌస్‌కి రాలేదన్నారు.

మోనాల్‌తో నేను ఎవరితో మాట్లాడొద్దని చెప్పలేదు.. ఆమె మాట్లాడకపోతే మీకెందుకు అంత ఇది అవుతుందో నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కోసం మేం కొట్లాడుకుని విడిపోలేదు.. రాజశేఖర్ మాస్టర్ రాంగ్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు అంటూ రాజశేఖర్‌పై ఫైర్ అయ్యాడు అఖిల్.

ఇక కుమార్ నామినేట్ అయ్యి వెళ్లి పోతుంటే.. అతను అఖిల్‌ని కరివేపాకు చూపించాడని.. తెగ ఫీల్ అయిపోయి.. అందుకే నువ్ అక్కడ ఉన్నావ్.. నేను ఇక్కడ ఉన్నా అని చెప్పావ్.. అది కరెక్ట్ కాదు.. నామినేట్ అయిన వారి పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు అని అఖిల్‌ని చురకలేస్తూ నామినేట్ చేశారు రాజశేఖర్ మాస్టర్. ఎలిమినేట్ అయిన వాళ్లని సంతోషంగా పంపించాలి.. బాధ పెట్టకూడదని అఖిల్‌కి గట్టిగా చెప్పాడు.