బిగ్‌బాస్ విజేత శ్రీముఖి.. ఫోటో వైరల్‌..!

647
bigg boss srimukhi
- Advertisement -

తెలుగు టెలివిజన్ లో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ తన హోస్టింగ్‌తో రక్తి కట్టిస్తే.. రెండో షోను తనదైన శైలిలో గెలుపు తీరాలకు చేర్చాడు నాని. ఇక మూడో సీజన్‌ను నాగార్జున ఎంతో ఎనర్జీతో ఫుల్ స్వింగ్‌లో చేస్తున్నాడు. ఈ సీజన్ ఫైనల్‌ ఆదివారం నాడు జరగనుంది. ఫైనల్స్‌లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి పోటీపడుతున్నారు.

bigg-boss-3 winner

మరోవైపు ఈ సీజన్ విజేత శ్రీముఖి అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలుగు బిగ్ బాస్‌లో తొలి మహిళా విజేత అంటూ పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బిగ్ బాట్ టైటిల్ ను అందుకున్న శ్రీముఖిని… హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్టు ఉంది.

srimukhi

ఇందులో ఎంత వరకు నిజం అనే దాంట్లో క్లారిటీ లేనప్పటికీ… ఈ పోస్ట్ కు జనాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అసలు విజేత ఎవరో తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. బిగ్‌బాస్ 3 ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యఅతిథిగా వస్తున్నట్లు సమాచారం.

- Advertisement -