బిగ్ బాస్ సీజన్ 3లో అసలు మజా మొదలైంది. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం ఎలిమినేషన్‌లో ఏకంగా ఎనిమిదిమంది నామినేట్ అయ్యా రు. ఇక మరోవైపు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో గత రికార్డులను చెరిపేస్తూ టీఆర్పీల విషయంలోనూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
బిగ్ బాస్ గత సీజన్లతో మూడో సీజన్‌ను పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. ఎన్టీఆర్, నానిలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాగార్జున. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్ సాధించి తాను ది బెస్ట్ అనిపించుకున్నారు.
రెండోవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఉన్నారు. ఇక తొలివారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి వచ్చింది. ఇక సెకండ్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.