బిగ్ బాస్ 5 తెలుగు..ఏడుపు మొదలైంది..!

233
bigg boss
- Advertisement -

బుల్లితెర పాపులర్‌ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. 106 రోజుల పాటు సాగే బిగ్ బాస్ 5లో భాగంగా 19 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటరవగా అప్పుడే ఏడుపుల ప్రక్రియ ప్రారంభమైంది. తొలివారం ఎలిమినేషన్‌ కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా అప్పుడే కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ఏడుపులతో ఆసక్తికరంగా మారింది.

తొలి వారం ఎలిమినేషన్‌కు సంబంధించి విడుదల చేసిన ప్రొమో అందరిని ఆకట్టుకుంటోంది. నల్లబ్యాగులో కంటెస్టెంట్‌ల ఫోటోలు ఉండటం,ఒక్కొక్కరూ ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారో వారి ఫోటోను ట్రక్‌లో వేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించారు. తొలుత వచ్చిన లోబో ఫోటోలను చూస్తూ కాసేపు నవ్వులు పూయించి చివరగా యాంకర్ రవిని ఎలిమినేట్‌కు నామినేట్ చేస్తున్నట్లు చెబుతూ యాట్యిట్యూడ్ తగ్గించుకోవాలని సూచించారు.

తర్వాత రవి…నటరాజ్ మాస్టర్ మధ్య గొడవ జరుగగా పలువురు కంటెస్టెంట్‌లు సైతం గొడవలు పడ్డారు. వీరిలో జెస్సీ, హమిదా ఇద్దరు ఏడుపు మొదలెట్టగా వారిని మిగితా సభ్యులు ఓదార్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగే అవకాశం ఉంది.

- Advertisement -