బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు గొడవలు, వాదోపవాదాలతో కనిపించిన హౌస్‌లో కుటుంబ సభ్యుల రాకతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. 68వ ఎపిసోడ్లో రామ్ ప్రసాద్ తల్లి, కూతురు, దేబ్జానీ తల్లిదండ్రులు, సుధీర్ తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు కంటెస్టెంట్లకు ఇచ్చిన సూచనలు, పరోక్షంగా చెప్పిన హింట్స్ ఆసక్తి రేపాయి.
ఎపిసోడ్ ప్రారంభంలో త్రిగుణ్, సుధీర్ గురించి నీతూ మాస్టర్, వర్షిణిలతో మాట్లాడాడు. బ్లాక్ టీ విషయంలో సుధీర్ తనకు తప్పుడు సమాచారం ఇచ్చాడని చెప్పాడు. మరోవైపు స్టీమర్‌ను నిర్లక్ష్యంగా వదిలేశాడనే విషయంపై ముకేష్, త్రిగుణ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకోవడంతో హౌస్‌లో వేడి పెరిగింది. అనంతరం బిగ్‌బాస్ నిర్వహించిన బీబీ స్కూల్ టాస్క్‌లో నరేష్ ప్రిన్సిపాల్‌గా అదరగొట్టాడు.
ఇక రామ్ ప్రసాద్ తల్లి ఆదిలక్ష్మి సడన్‌గా కిచెన్‌లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ఆట బాగానే ఉందని, అయితే ఇటీవల కాస్త తగ్గిందని రామ్ ప్రసాద్‌తో చెప్పారు. తనకు కన్నింగ్ అనే పేరు రావడం బాధగా ఉందని, అవసరమైన చోట గట్టిగా మాట్లాడాలని సూచించారు. ఇతర కంటెస్టెంట్ల ఎలిమినేషన్ల గురించి చర్చించవద్దని కూడా హెచ్చరించారు. అనంతరం రామ్ ప్రసాద్ కూతురు ఉజ్వల ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది.
Also Read:లివర్ ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్స్ ఇవే!
తర్వాత దేబ్జానీ తల్లిదండ్రులు హౌస్‌లోకి వచ్చారు. త్రిగుణ్ ఆటను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆమె తండ్రి.. అతడిని త్రిమూర్తితో పోల్చడం ఆసక్తికరంగా మారింది. నరేష్, రామ్ ప్రసాద్, దేబ్జానీ ముగ్గురూ కలిసి ఆడాలని సూచించారు. దేబ్జానీకి మాత్రం ఆటపై దృష్టి పెట్టాలని, నామినేషన్లలో బలమైన కారణాలు చెప్పాలని, తనలోని దుర్గామాత రూపాన్ని చూపించాలని హితవు పలికారు. చివరగా సుధీర్ తల్లి ఎంట్రీతో ఫ్యామిలీ వీక్ మరింత ఆసక్తికరంగా మారింది.

