బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో గోట్ టాస్క్ ఆసక్తికర మలుపులు తిరిగింది. మొదటి నుంచి గట్టిగా పోరాడిన త్రిగుణ్, శివ తమ సత్తా చాటుకున్నారు. మరోవైపు ముకేష్ తన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటూనే గ్రీన్ లెవల్‌లోకి చేరాడు. శుక్రవారం ప్రసారమైన 48వ ఎపిసోడ్‌లో పోటీదారుల మధ్య పోరాటం, భావోద్వేగాలు, వ్యూహాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
గ్రీన్ లెవల్‌లో తన ఫొటోను చూసుకున్న దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. చివరకు న్యాయం గెలిచిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా త్రిగుణ్ ఆమెను అభినందించాడు. అమన్, నీతూ కూడా కష్టపడి పోరాడారని ప్రశంసించాడు.
ఎల్లో లెవల్‌లో ఉన్న సభ్యులకు బిగ్‌బాస్ ‘గోట్ ఆఫ్ కామన్ సెన్స్’ టాస్క్ ఇచ్చాడు. ప్రశ్నలకు ముందుగా బెల్ మోగించి సరైన సమాధానాలు చెప్పాలని సూచించాడు. అయితే ముకేష్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా ముందుగా బెల్ మోగించడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరకు ఎక్కువ పాయింట్లు సాధించి గ్రీన్ లెవల్‌కు చేరడంతో పాటు రెండు వారాల ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందాడు.
మరో టాస్క్‌లో రామ్ ప్రసాద్, నరేష్ ఒక జట్టుగా, త్రిగుణ్, శివ మరో జట్టుగా పోటీపడ్డారు. తీవ్రంగా పోరాడిన త్రిగుణ్, శివ విజయం సాధించారు. అయితే వారిలో ఒక్కరే గ్రీన్ లెవల్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో త్రిగుణ్ శివను ఒప్పించాడు. చివరకు శివ తన అవకాశాన్ని త్రిగుణ్‌కు వదులుకున్నాడు.గతంలో తనను మోసం చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్న త్రిగుణ్‌కు ఇప్పుడు అవకాశం ఇవ్వడం కాలచక్రం లాంటిదని శివ వ్యాఖ్యానించాడు. త్రిగుణ్ కష్టాన్ని గుర్తించి అతడిని గోట్ ఆఫ్ స్పీడ్‌గా ఎంపిక చేశాడు. దీంతో త్రిగుణ్ ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు.
Also Read:కన్నెపల్లి పంప్‌హౌస్‌కు బీఆర్ఎస్ బృందం
త్రిగుణ్, శివల కలయిక, శివ చేసిన త్యాగం ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ముకేష్ గ్రీన్ లెవల్‌కు చేరడంతో హౌస్‌లో తదుపరి పరిణామాలపై ఆసక్తి పెరిగింది.

