BB10:డేంజర్ జోన్‌లో అగ్ని పరీక్ష టీమ్

2
- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియ హీటెక్కింది. నామినేషన్స్ పూర్తయ్యే సరికి అగ్ని పరీక్ష టీమ్ సభ్యులంతా డేంజర్ జోన్‌లోకి వచ్చారు. తమ టీమ్‌లోని వారంతా నామినేషన్స్‌లో ఉంటే.. ఎలిమినేషన్ ముప్పు తమపైనే పడే అవకాశం ఉందని ముందే ఊహించిన రోహిత్.. సెలెబ్రిటీ టీమ్ నుంచి కూడా వీలైనంత మందిని నామినేషన్స్‌లోకి తీసుకురావాలని తన టీమ్‌కు సూచించాడు.

రోహిత్ వేసిన ఈ ప్లాన్‌ను నరేష్ ముందుగానే పసిగట్టాడు. తమను నామినేట్ చేయడమే అగ్ని పరీక్ష టీమ్ వ్యూహమని నరేష్ చెప్పడంతో సెలెబ్రిటీ టీమ్ సభ్యులు చప్పట్లు కొట్టారు.

ఇక నామినేషన్ ప్రక్రియలో సుధీర్.. రోహిత్, షాలినీని టార్గెట్ చేశాడు. రోహిత్ ప్రభావంతో షాలినీ గేమ్ మారుతోందని ఆరోపించాడు. దీనిపై షాలినీ కూడా గట్టిగానే స్పందించింది. అనంతరం వంశీ, షాలినీ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.

మరోవైపు చరణ్.. ముకేష్‌ను నామినేట్ చేయగా, అపూర్వ కూడా ముకేష్‌ను టార్గెట్ చేసింది. ‘నువ్వు తోపు అయితే.. నీకు నేను బాపు’ అంటూ అపూర్వ చేసిన వ్యాఖ్యలపై ముకేష్ కౌంటర్ ఇచ్చాడు.అపూర్వ, ఝాన్సీ మధ్య కూడా నామినేషన్ సందర్భంగా వాగ్వాదం జరిగింది. తనకు ఇమ్యూనిటీ అవసరం లేదని, ప్రేక్షకులు ఉంచాలని అనుకుంటే తాను కొనసాగుతానని ఝాన్సీ చెప్పింది. నరేష్.. చరణ్‌ను నామినేట్ చేస్తూ అతని ఆటతీరుపై విమర్శలు చేశాడు.

Also Read:కేటీఆర్‌ సాయంతో సైక్లింగ్‌లో స్వర్ణం

ఇక ఝాన్సీ, దేబ్జానీ ఇద్దరూ రోహిత్‌ను నామినేట్ చేశారు. అగ్ని పరీక్షలో కనిపించిన రోహిత్‌కు, ఇప్పుడు కనిపిస్తున్న రోహిత్‌కు చాలా తేడా ఉందని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై రోహిత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

చివరకు అమన్, అపూర్వ, ముకేష్, రోహిత్, ఝాన్సీ, చరణ్, నరేష్, షాలినీ, రాం ప్రసాద్, త్రిగుణ్ నామినేషన్స్‌లో నిలిచారు. మొత్తంగా అగ్ని పరీక్ష టీమ్ సభ్యులంతా నామినేట్ కావడంతో ఈ వారం ఆ టీమ్ నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -