బిగ్ బాస్ రెండవ సిజన్ తో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో 13మంది సెలబ్రెటిలు ఉండగా మరో ముగ్గురిని సామాన్యులను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు నుంచే హౌజ్ లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన సంజన మొదటిరోజు నుంచే జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈసందర్భంగా ఆమె ప్రవర్తన ప్రేక్షకులకు మరియు మిగతా పార్టిసిపెంట్స్ కు నచ్చక ఆమె ను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ టీం.
ఈసందర్భంగా ఆమె బిగ్ బాస్ హౌజ్ గురించి పలు విషయాలు వెల్లడించారు. హౌజ్ లో నుంచి బయటకు రాగానే బాబు గోగినేని, నటి తేజస్వీ పై కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో నాని గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హోస్ట్ గా నాని తనకు నచ్చలేదని చెప్పింది. అందుకే ఈషో అంత పెద్దగా హిట్ కావడంలేదని తెలిపింది.
బిగ్ బాస్ 1 అంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పింది. నానికి ఎన్టీఆర్ కు అసలు సంబంధం లేదని.. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ త నాని పోల్చవద్దని చెప్పింది. అందుకే నాకు ఆ షో నచ్చక బయటకు వచ్చేశానంది. తాను ఎన్టీఆర్ కు వీరాభిమానినని, నాని సినిమాలు వ్యక్తిగతంగా ఇష్టపడతనన్నారు. బిగ్ బాస్ లో మరోసారి అవకాశం వచ్చినా వెళ్లలని తేల్చి చెప్పింది.