బిగ్ బాస్ సీజన్ 2 బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. మొదటి వారం కాస్త నెమ్మదిగా సాగినా..రెండవ వారం నుంచి హుషారుగా సాగుతుంది. ఇక సామాన్యురాలుగా షోకి ఎంట్రీ ఇచ్చిన సంజన మొదటి వారంలోనే ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒక్కొవారం ఒకొక్కరు ఎలిమినెట్ అవుతుంటే షో మరింత ఉత్సాహవంతంగా సాగుతుంది. ఎవరెవరూ ఎలిమినెట్ అవుతారా అని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
బిగ్ బాస్ మూడవవారంలోకి అడుగుపెట్టిన తర్వాత దామరాజు కిరీటి ఎలిమినెట్ అయ్యాడు. ఈసందర్భంగా ఆయన పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ తనకు చాలా బాగా నచ్చిందని..హౌస్ లోని అనుభవాలు, జ్ఞాపకాలు మర్చిపోలేనివన్నారు. హౌస్ నుంచి బయటకు రావడం తనకు బాధ కలిగించిందన్నారు.
బయట ప్రచారం జరగుతున్నట్లుగా బిగ్ బాస్ హౌస్ లో కుట్రలు, కుతంత్రాలు ఏమి లేవన్నారు. అక్కడున్న వారిలో టైటిల్ గెలిచే అవకాశం కొంతమందికే ఉందని..నాకు తెలిసి బిగ్ బాస్ 2 టైటిల్ తేజస్వీ గెలుస్తుందని చెప్పారు. ఈ షో ద్వారా పలువురు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయన్నారు. బాబు గోగినేనితో ఎంతో సాన్నిహిత్యం ఏర్పడిందని..ఆయన తనకు చెప్పిన మాటలు మరచిపోలేనన్నారు. నాని మాట్లాడే మాటలపైనే కంటెస్టెంట్ ల భవిష్యత్తు ఆధారపడి ఉందని.. నాని అద్బుతంగా హోస్టింగ్ చేస్తున్నారన్నారు.