ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అఖండ విజయం సాధించారు. లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గోరఖ్‌పూర్ అర్భన్ స్థానం నుంచి గెలుపొందారు.యోగీ ఆదిత్యనాథ్ ఒక ముఖ్యమంత్రిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా ఘన విజయం సాధించారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5 న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరిగడ్వాల్ జిల్లాలోని పాంచుర్‌లో రాజ్‌పుట్ కుటుంబంలో జన్మించారు. ఆయన ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు.ఆయనకు ఈతలో, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. ఇక 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు (26) ఆయనే. అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు (1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికయ్యారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా సైతం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతి అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు. చిన్ననాటి నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్‌సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు.
44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు. పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ జాతీయవాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్తారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5 వేల మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని హిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. సన్యాసి అంటే ప్రపంచం ప్రజల నుంచి ఏది ఆశించకుండా తన దగ్గర నుంచి చెయ్యగలగిన మంచి ప్రపంచానికి ప్రజలకు చేసేవాడు.. శారీరిక సుఖాలు సంసారిక బంధాలు లేకుండా దేశం ధర్మం ఊపిరిగా జీవిస్తున్న సన్యాసి యోగి ఆదిత్యనాధ్..
23 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. కరోన మొదటి వేవ్ సమయంలో ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చెయ్యాలి అని అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వలస కూలీలని రెచ్చగొట్టి పంపితే మౌనంగా వారికి ఆశ్రయం కల్పించి పరిస్థితి చక్కదిద్దేందుకు కృషి చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యూపీలో కరోన అదుపు చేసిన విధానాన్ని కేస్ స్టడీ కింద తీసుకునే స్థాయిలో ఆకట్టుకున్నారు ఆయన..వచ్చే రోజుల్లో యూపీని దేశంలో అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్ధి ఉత్తరప్రదేశ్ బాగుపడితే దేశం బాగుపడినట్టే అన్న అటల్ జీ మాటలు నిజం చేస్తారు ఆయన.. అభివృద్ధి పరంగా కూడా దేశంలో తమిళనాడు గుజరాత్ లాంటి రాష్ట్రాలకి వెనక్కి నెట్టి ఇప్పుడు జీడీపీ పరంగా రెండో స్థానంలోకి వచ్చింది యూపీ.. గుజరాత్ అభివృద్ధి రోల్ మోడల్ గా మోడీజీ వచ్చినట్టే యూపీ రోల్ మోడల్ గా యోగిజీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతారు. 2026 తర్వాత అని నొక్కివక్కాణిస్తూ.. రెండోసారి భారీ విజయంతో సీఎం అయ్యి చరిత్ర తిరగరాసిన పూజ్య యోగి అదిత్యనాధ్ గారికి అభినందలు..