BRS:బి‌ఆర్‌ఎస్ ముందు బిగ్ టాస్క్?

45
- Advertisement -

2024 లో బి‌ఆర్‌ఎస్ పార్టీ భారీ లక్ష్యాలనే నిర్దేశించుకుందని చెప్పాలి. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికి, కేవలం 2 శాతం ఓటు షేర్ తేడా మాత్రమే ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కే‌సి‌ఆర్ పాలనకే జై కొడుతున్నారనే సంగతి స్పష్టమౌతుంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని పార్టీ అగ్రనేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపై బి‌ఆర్‌ఎస్ దృష్టి సారిస్తున్నాట్లు తెలుస్తోంది. 17 స్థానాలకు గాను దాదాపు అన్నీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటేలా అధినేత కే‌సి‌ఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. సిట్టింగ్ ల మార్పు, సరైన నేతల ఎంపిక వంటి తదితర అంశాలపై అధినేత కే‌సి‌ఆర్ గట్టిగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. .

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ కాకుండా అన్నీ విధాలా పార్టీని సమాయత్తం చేస్తున్నారు. ఇకపోతే దేశ రాజకీయాల్లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన కే‌సి‌ఆర్.. ఈ ఏడాది దాదాపు అన్నీ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అక్కడి స్థానిక పార్టీలకు అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చేలా పార్టీని బలోపేతం చేశారు కే‌సి‌ఆర్. అదే విధంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా గట్టిగా ఫోకస్ చేయనున్నారు. ఇదే ఏడాది ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేసే విధంగా బి‌ఆర్‌ఎస్ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాస్త నిరాశ పరిచినప్పటికి.. రానున్న మిగతా ఎన్నికల్లో సత్తా చాటెందుకు బి‌ఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరి పార్టీ ముందున్న బిగ్ టాస్క్ లను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -