ఎన్టీఆర్ ముందు బిగ్ టార్గెట్?

45
- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర ‘ అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రెల్ 5 న విడుదల చేయబోతుంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం 80 శాతానికి పైగా పూర్తయినట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ ఇటీవల స్పష్టం చేశారు. పాన్ ఇండియా మూవీగా ఋపొందుతుండడంతో వీలైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేసి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తోంది చిత్ర యూనిట్. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అయితే పాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదల అవుతుండడంతో టీజర్ ఇంపాక్ట్ ద్వారానే మూవీపై హైప్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో సలార్, ఆదిపురుష్ టీజర్స్ డిజిటల్ రికార్డ్స్ పరంగా టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక తెలుగు విషయానికొస్తే సలార్ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఒన్ మిలియన్ కు పైగా లైక్స్ రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది. అలాగే పవన్ కల్యాణ్ భీమ్లానాయక్, ఓజీ.. టీజర్స్ కూడా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేవర గ్లింప్స్ ఈ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడే దేవర పై పాన్ ఇండియా స్థాయిలో హైప్ రెట్టింపు అవుతుంది. పైగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో కలెక్షన్ల పరంగా ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ ను అందుకోవడం ఎన్టీఆర్ ముందు ఉన్న మరో బిగ్ టార్గెట్. మరి పక్కా మాస్ ట్రీట్ గా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ ఎలాంటి రికార్డ్స్ ను సెట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -