మెగాస్టార్ ఫ్యాన్స్‌కి పండగే!

8
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన సోషియల్ ఫాంటసీ చిత్రం విశ్వంభర ను 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు సాయంత్రం 06:06 గంటలకు విడుదల చేయనున్నారు.

ఇక చిరు – అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రేపు విడుదల కానుందని కూడా అధికారికంగా ప్రకటించారు. తాజాగా మేకర్స్ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్, ప్రసాద్ మల్టీప్లెక్స్ (స్క్రీన్ 6) లో జరగనుంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ “మన శంకర వర ప్రసాద్ గారు” గా ఉండొచ్చని, అలాగే ట్యాగ్‌లైన్ “పండగకి వస్తున్నారు” అని టాక్ వినిపిస్తోంది. కానీ ఇది నిజమా కాదా అన్నది మేకర్స్ రేపే క్లారిటీ ఇవ్వనున్నారు. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తుండగా సంక్రాంతి 2026కి రిలీజ్ కానుంది.

Also Read:పాము బర్త్ డే..యువకుడి అరెస్ట్

- Advertisement -