కల్కి..అదిరే సర్‌ప్రైజ్!

10
- Advertisement -

భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రో రెండు రోజుల్లో `క‌ల్కి 2898 ఏడీ` చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తోడు… ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొణె, దిశాప‌టానీ కీల‌క పాత్రలు పోషించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో ప్ర‌భాస్ భైర‌వ పాత్ర‌లో ప్రభాస్ కనువిందు చేయనుండగా బిగ్ సర్‌ప్రైజ్ ఉండనుందట.శ్రీ‌కృష్ణుడి పాత్ర కూడా ఉండనుందని… ఈ పాత్ర‌ను వీఎఫ్ఎక్స్ తో తీర్చిదిద్దార‌ని.. ఈ పాత్ర‌లో లెజెండ‌రీ యాక్ట‌ర్ నంద‌మూరి తార‌క‌రామారావు క‌నిపించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:ఆషాడ బోనాలకు నిధులు విడుదల..

- Advertisement -