TVK అధినేత విజయ్‌కు బిగ్ షాక్

6
- Advertisement -

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీకి వ్యతిరేకంగా విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో విజయ్‌కు న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

ఆదాయపు పన్ను శాఖ తనపై అన్యాయంగా పెనాల్టీ విధించిందని, అందులో చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొంటూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పెనాల్టీని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు విజయ్ వాదనలను స్వీకరించలేదు.

ఈ నేపథ్యంలో, విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీ కొనసాగనుంది. ఈ తీర్పు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

- Advertisement -