- Advertisement -
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటు వేయకుండా నిలువరించింది.
హసీనాకు చెందిన జాతీయ గుర్తింపు కార్డు(ఎన్ఐడీ)ను లాక్ చేసినట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. ఢాకాలోని నిర్బచన్ భవన్‌లో ఎన్నికల సంఘం కార్యదర్శి అక్తర్ అహ్మద్ ఈ విషయాన్ని మీడియాకు అధికారికంగా వెల్లడించారు.
విదేశాల్లో తలదాచుకుంటున్న వారు ఓటు వేయాలంటే వారి ఎన్ఐడీ కార్డు యాక్టివ్‌గా ఉండాలి… షేక్ హసీనా ఎన్ఐడీ లాక్ చేసినట్లు తెలిపారు. హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఐడీ కార్డులను కూడా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
- Advertisement -

