రేవంత్‌రెడ్డి కి బిగ్‌ షాక్‌

355
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి మరో గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే వర్గపోరుతో అతలాకుతలమైపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆ పార్టీలోని వర్గపోరు మరింత పతనావస్థకు చేరుస్తోందనే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నానాటికి కనుమరుగైపోతున్న తరుణంలో.. అసలు కాంగ్రెస్‌ పార్టీనే జనం మరిచిపోతున్న తరుణంలో ఆ పార్టీకి కాంగ్రెస్‌ పార్టీ నేతలే మోకాలడ్డుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి ఒంటెద్దుపోకడలతో సీనియర్‌ పార్టీ నేతలు రేవంత్‌ పై ఒంటికాలిపై లేస్తున్నారన్నది జగమెరిగి సత్యం. ఇప్పటికే రేవంత్‌ పై పార్టీ సీనియర్‌ నేతలు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

రేవంత్‌ కు వ్యతిరేకంగా పార్టీ సీనియర్‌ నేతలు, వీహెచ్‌, జగ్గారెడ్డి, మధుయాష్కి, వీహెచ్‌, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు రేవంత్‌ కు వ్యతిరేకంగా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని సద్దుమణిగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగి ఇరు వర్గాల నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా… అది విఫలప్రయత్నంగానే కనిపిస్తోంది. వర్గపోరు సద్దుమణగకపోగా.. ఇంకా తీవ్రరూపం దాల్చినట్టుగానే కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసినా శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్ లీడర్లు హాజరుకాకపోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేవలం ఈ మీటింగ్‌ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోదండ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ వర్గం, రేవంత్‌ వ్యతిరేక వర్గంల మధ్య గ్యాప్‌ మరింత పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -