అనిల్‌ అంబానీకి బిగ్ షాక్‌..!

6
- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి బిగ్ షాక్ తగిలింది. అంబాని కంపెనీలకు చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అనిల్‌ అంబానీకి చెందిన గ్రూప్‌ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆస్తులను అటాచ్ చేసి ద‌ర్యాప్తు చేస్తోంది ఈడీ, సీబీఐ.

ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్‌ (Mumbai Pali Hill) ప్రాంతంలో గల అనిల్‌ అంబానీ నివాసం, న్యూఢిల్లీలోని రిలయన్స్‌ సెంటర్‌, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌, ముంబై, పూణె, థానే, హైదరాబాద్‌, చెన్నైల్లో అనిల్‌ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి.

Also Read:Maoists:మరో ఆరు నెలలు కాల్పుల విరమణ

- Advertisement -