నటుడు మోహన్ బాబుకు షాక్ తగిలింది. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. అంతేగాదు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది.
మూడేళ్లు గా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్.జ
విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read:భూమనపై భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు
జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులు పట్టించుకోకపోవడంతో, విద్యార్థుల వద్ద వసూలు చేసిన రూ.26.17 కోట్ల అధిక ఫీజును 15 రోజుల్లో చెల్లించాలని, రూ.15 లక్షల జరిమానా కట్టాలని ఇటీవల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఎంబీయూ గుర్తింపు రద్దు చేసి, విద్యార్థుల కోసం పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.

