- Advertisement -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా తీర్పునిచ్చారు. ఇమ్రాన్ కు రూ.10లక్షలు, బుష్రాకు రూ.5లక్షలు జరిమానా విధించారు.
1996లో ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఆల్ ఖాదిర్ ట్రస్ట్ ను స్థాపించారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. ఈ ట్రస్టు మాటున అవినీతి జరిగిందంటూ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) డిసెంబర్ 2023లో ఇమ్రాన్ ఖాన్, అతని భార్యతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ పై సుమారు 200 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆయన అడియాలా జైల్లో ఉన్నారు.
Also Read:ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసన
- Advertisement -