అమెరికాలోని ఎన్నారైలకు బిగ్ షాకిచ్చింది ట్రంప్ స్కార్. విదేశీ డబ్బు బదిలీలపై 5% పన్ను విధించాలని అమెరికా బిల్లును ప్రతిపాదించింది. ఇది ఆమోదం పొందితే ఎన్నారైలు పంపించే మనీపై అదనంగా పన్ను పడనుంది.
హెచ్-1బీ, ఎఫ్-1 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు కలిగిన వ్యక్తులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, డాక్యుమెంట్ లేని వలసదారులు అంతా ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వెస్ట్రన్ యూనియన్, పేపాల్ లేదా సాధారణ బ్యాంకుల ద్వారా చేసే డబ్బు బదిలీలపై ఈ పన్ను వసూలు చేస్తారు. చట్టం ఆమోదం అయితే, 2025 జూలై నుంచి అమలు కానుంది.
వాస్తవానికి 2016లో అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదన చేశారు. తాజాగా మరోసారి ట్రంప్ అధ్యక్షుడు కావడంతో మళ్లీ తెరపైకి ఈ ప్రతిపాదన తెచ్చారు. ఈ చట్టం అమలైతే అన్ని అంతర్జాతీయ రెమిటెన్స్‌లపై 5% పన్ను విధించబడుతుంది. ప్రధానంగా హెచ్-1బీ, ఎఫ్-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, డాక్యుమెంట్ లేని వలసదారులపై ప్రభావం పడనుంది.
Also Read:బ్లాక్ కాఫీ..తెలిస్తే అస్సలు వదలరు!

