నటి హన్సికకు బిగ్ షాక్..!

8
- Advertisement -

నటి హన్సికకు బిగ్ షాక్ తగిలింది. మరదలు పెట్టిన వేధింపుల కేసులో హన్సికకు ముంబైలోని సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. హన్సిక తమ్ముడు ప్రశాంత్ మోత్వానీకి, టీవీ నటి ముస్కాన్‌కు 2020లో వివాహం అయింది.

కొంతకాలానికే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు దంపతులు. ఈ క్రమంలో తనను భర్త ప్రశాంత్, అత్త, ఆడపడుచు అయిన హన్సిక తీవ్రంగా వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్కాన్.

Also Read:రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండండి!

తనపై ఉన్న కేసును పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది హన్సిక. తాజాగా దీనిపై విచారణ జరిపి.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.

- Advertisement -