పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ చిత్రం కీలక షెడ్యూల్ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్‌లో పవన్, శ్రీలీలతో పాటు ముఖ్య నటులందరూ పాల్గొననున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వరుసగా 15 రోజుల పాటు డేట్స్ ఇచిన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం స్టార్ట్ కానున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట.
యాక్షన్ ఎపిసోడ్ అనంతరం పవన్ కళ్యాణ్ పై సోలో సాంగ్ ను షూట్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను జూలై లో ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జూలై నెలలో కూడా ఈ సినిమా కోసం 11 రోజుల పాటు డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఖరారైన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. పూజా ప్లేస్ లో శ్రీలీల ను తీసుకున్నారు.
Also Read: #VNRTrio:మ్యూజిక్ సిట్టింగ్
అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.
Also Read: #BoyapatiRAPO: మైసూర్ షెడ్యూల్ రెడీ..