తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఈఎన్ఈ రిపీట్’. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో క్రేజీ గ్యాంగ్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.ఈ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి గారు, కరుణ్ కుమార్ గారు.. శివాత్మిక .. అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఒక దర్శకుడిగా వాళ్లందరికీ థాంక్యూ చెప్తున్నాను. నందిని రెడ్డి గారు అద్భుతమైన నటి. నేను డైరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా డైరెక్షన్ టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్తున్నాను. నేను వాళ్ల తరఫునే మాట్లాడుతున్నాను. మీ కుటుంబ సభ్యులు గర్వపడే క్షణమిది అని భావిస్తున్నాను. అలాగే ప్రొడక్షన్ టీమ్‌కు థాంక్యూ. సృజన్, సందీప్.. థాంక్యూ. ఎందుకంటే వాళ్లు డైరెక్షన్ టీమ్‌కు సరైన గౌరవం ఇచ్చారు. డైరెక్షన్ అనేది కూలి పని కాదు. చదువుకుని వచ్చి చేసే పని. వాళ్లకు సరైన గౌరవం ఇచ్చిన మన నిర్మాతలకు థాంక్యూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూలెక్కలు వేసుకుంటారు. కానీ లెక్కలేకుండా ప్రేమించేది ప్రేక్షకులు మాత్రమే. మా సినిమాకు లెక్కలేనంత ప్రేమ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేనెవరో చూడకుండా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది సినిమాపై మీకున్న ప్రేమ. ఈ ప్రేమతో ఏదైనా సాధ్యమే.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈఎన్ఈ రిపీట్’ విజయం నాకు చాలా రిలీఫ్‌ను ఇచ్చింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే మేము సినిమా చూసుకున్నాం. ఒకే సినిమాలో అన్ని అద్భుతమైన డైనమిక్స్ మాకు కనిపించాయి. మన జీవితాన్నే తెరపై ఆవిష్కరించాడు తరుణ్. ముంబైలో ఫిల్మ్ కోర్స్ చేసిన తర్వాత, 17 ఏళ్ల వయసులోనే నేను హైదరాబాద్‌లో చాలా ఆఫీసులు తిరిగి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. ఆ ప్రయాణంలో చాలా కష్టాలు చూశాను. మనల్ని పెట్టి ఎవరో సినిమా తీయడం లేదని నేనే నా డైరెక్షన్లో యాక్టర్‌గా ‘పలక్ నామా దాస్’ సినిమాను స్టార్ట్ చేశాను. మరో 25 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా ‘ఈ నగరానికి ఏమైంది’ ఆడిషన్స్‌కు వెళ్లాను. ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని చెప్పారు.
Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్

