తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ తెలంగాణ హైకోర్టు కీలక తుది తీర్పును వెలువరించింది. గ్రూప్-1 నియామకాలపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, బయోమెట్రిక్ ప్రక్రియలో లోపాలున్నాయంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఫలితాల రద్దు, పునర్మూల్యాంకన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
ఈ తీర్పుతో ఇప్పటికే ఎంపికైన 562 మంది అభ్యర్థులకు పూర్తి స్థాయి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే వీరికి శిక్షణ ప్రారంభమై ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read:హార్వర్డ్ యూనివర్సిటీకి ఆర్ఎస్ ప్రవీణ్ ఈ-మెయిల్

