మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో రిలీఫ్..

4
- Advertisement -

నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దెబ్బ తగిలిన జర్నలిస్ట్ ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, లిఖితపూర్వకంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పారని ఆయన తరపు న్యాయవాది… వెల్లడించారు. అలాగే తనకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తామని ప్రకటించారు అని తెలిపారు.

మోహన్ బాబు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, ఒక సెలబ్రెటీ గా ఉన్నారు. అలాంటి పని కావాలని చేయలేదు అని చెప్పారు. ఈ గొడవ మొత్తం ఒక యూనివర్సిటీ, విద్యా సంస్థలకు సంబంధించి తప్ప మరేమీ లేదు అని తెలిపారు. అయితే దెబ్బలు తగిలిన జర్నలిస్ట్ ఎలా ఉన్నారని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అమానుల్లాహ్ ధర్మాసనం అడగడంతో జర్నలిస్ట్ తరపు న్యాయవాది పరిస్థితిని వివరించారు.

మోహన్ బాబు విజ్ఞప్తి, వాదనలు పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read:నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజలు!

- Advertisement -