ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ రిలీఫ్

6
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన కేసును కొట్టేసింది ఏపీ హైకోర్టు. లైంగిక వేధింపుల కేసు అసత్యమని తేలడంతో హైకోర్టు కొట్టేసింది.ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు హాజరై తాను చేసిన ఆరోపణలు, FIRలో అంశాలన్నీ అవాస్తవమని, కేసును కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించడంతో కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆదిమూలంకు బిగ్ రిలీఫ్ లభించింది.

ఇటీవల ఆదిమూలంపై తిరుపతి పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారంటూ వారి తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో కోనేటి ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Also Read:మూసీ సుందరీకరణ పాకిస్థాన్ కంపెనీకా?:కేటీఆర్

- Advertisement -