మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్

4
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట దక్కింది. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..ఈ కేసులో హరీశ్‌ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

అరెస్టు మినహా తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని తెలిపింది. ఇదే క్రమంలో హరీశ్‌ రావుపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీసింది.రాజ‌కీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేశార‌ని ..తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని హరీశ్‌ రావు మండిపడిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్‌పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాల‌ని కోర్టును కోరగా ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం.

Also Read:అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్‌ ప్ర‌ధాని ..

- Advertisement -