మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్

4
- Advertisement -

వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. సింగయ్య మృతి కేసులో జగన్ సహా వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరుగగా కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణనను రెండు వారాలకు వాయిదా వేసింది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో గత నెల 18న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ పర్యటన సమయంలో సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. సింగయ్య మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి జగన్‌ను ఏ2గా చేర్చారు. ఏ1గా జగన్ వాహన డ్రైవర్ రమణారెడ్డి, ఏ3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వర రెడ్డి, ఏ4గా వైవీ సుబ్బారెడ్డి, ఏ5గా పేర్ని నాని, ఏ6గా విడుదల రజిని తదితరులను చేర్చారు.

Also Read:బుల్డోజర్ రాజ్‌పై హరీశ్ రావు ట్వీట్

- Advertisement -