దర్శకుడు ఆర్జీవీకి బిగ్ రిలీఫ్

6
- Advertisement -

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్టీవీపై నమోదయిన కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను సినిమాలో దూషిస్తూ పోస్టులు పెట్టారంటూ గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2019 లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు.

ఇంతకాలం ఏం చేశారని అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. రామ్ గోపాల్ వర్మను కేసుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read:RC16 సెట్స్‌లో కన్నడ స్టార్!

- Advertisement -