Chandrababu:బాబుకు రిలీఫ్.. ఇక తిరుగేలేదా?

22
- Advertisement -

ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతి రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పై ఏర్పడ్డ సందిగ్ధత తొలగిపోయేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చంద్రబాబు హయాంలో చేపట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అవకతవకలు జరిగాయని ప్రస్తుత జగన్ సర్కార్.. చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. అయితే ఈ కేసు విషయంలో ముందస్తు బయలు కోసం చంద్రబాబు నాయుడు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ పై సానుకూలంగానే తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై తీర్పు వెలువరించిన అత్యున్నత ధర్మాసనం.. బాబుకు ఊరట కలిగించేలా తీర్పునిచ్చింది.

కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండబోదంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. ఈ పరిణామం ఎన్నికల ముందు బాబుకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఆయా కేసులు చంద్రబాబు చుట్టూ ముట్టిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, అంగళ్లు కేసు.. ఇలా చాలా కేసులే బాబును చుట్టుముడుతూ వచ్చాయి. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో పూర్తిస్థాయి బెయిల్ లభించగా.. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో కూడా బెయిల్ పై అడ్డంకులు తొలగిపోవడంతో టిడిపి క్యాడర్ నయా ఉత్సాహం నెలకుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ఇప్పటికే ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటు చుట్టుముట్టిన కేసులు కూడా ఒక్కొక్కటిగా వీగిపోతుండడంతో ముందు రోజుల్లో బాబు ప్రణాళికలో ఎలా ఉంటాయో చూడాలి.

Also Read:Filmfare:ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌

- Advertisement -