స్మార్ట్‌ఫోన్ల పై భారీ ఆఫర్లు..!

280
big offers on smartphones
- Advertisement -

పండగ సీజన్‌ లో వినియోగ‌దారుల‌ను ఆకర్షించే పనిలో భాగంగా.. `దివాలీ విత్ ఎమ్ఐ` పేరుతో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సెస‌రీస్‌, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌పై భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. అధికారిక ఎమ్ఐ వెబ్‌సైట్‌లో రేపు ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. అంతేకాకుండా `ద దియా హంట్‌` అనే కాంటెస్ట్ ద్వారా డిస్కౌంట్ కూప‌న్లు, స్మార్ట్‌ఫోన్ల‌ను గెల్చుకునే అవ‌కాశాన్ని కూడా క‌ల్పించింది.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొన‌డానికి ముందు ఎమ్ఐ వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా రూ. 1 సేల్‌, బిడ్ టు విన్, ఫాస్టెస్ట్ ఫింగ‌ర్ వంటి కాంటెస్టుల‌ను కూడా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎమ్ఐ పేర్కొంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా క‌నీసం రూ. 8000 చెల్లించిన వారికి 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టించింది.

 big offers on smartphones

అంతేకాకుండా రెడ్‌మీ నోట్4 కోసం పేటీఎం ద్వారా చెల్లిస్తే రూ. 400 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించ‌నుంది. అలాగే ఎమ్ఐ వెబ్‌సైట్‌లో చేసిన ప్ర‌తి కొనుగోలుతో దేశీయ విమాన ప్ర‌యాణ టిక్కెట్ల‌పై రూ. 1111 వ‌ర‌కు త‌గ్గింపును పేటీఎం అంద‌జేయ‌నుంది.

ఈ సేల్‌లో భాగంగా ఎమ్ఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఆండ్రాయిడ్ నౌగ‌ట్ ఆప‌రేటింగ్ సిస్టం ద్వారా ప‌నిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ. 14,999. దీంతో ఎమ్ఐ రెడ్‌మీ నోట్‌4, ఎమ్ఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ల‌ను కూడా ఈ సేల్ ద్వారా అందించ‌నుంది.

- Advertisement -