రెండో లిస్టుపై రాజకీయ ఒత్తిడి

202
Big names in second list
Big names in second list
- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో అలజడి సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ ముగిసింది. పూరీ జగన్నాధ్‌తో మొదలైన విచారణ చివరిగా యువ హీరో నందుతో ముగిసింది. ఈకేసులో చిత్ర పరిశ్రమకు చెందిన 12 మందికి సిట్‌ నోటీసులు జారీచేయగా వారందరూ విచారణకు హాజరయ్యారు. కేవలం మూడు గంటల్లోనే నందు విచారణను ముగించారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సాక్షులు వెల్లడించిన అంశాలతో రూపొందించిన వీడియో సీడీలు, కేసు డైరీని సిట్‌ అధికారులు సిటీ సివిల్‌ కోర్టుకు త్వరలో సమర్పించనున్నారు. వాటిని న్యాయస్థానం పరిశీలించిన తర్వాత ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. సిట్‌ నోటీసుల మేరకు విచారణకు హాజరైన వారిపై కేసులు నమోదు చేసే విషయంలో కూడా అప్పుడే స్పష్టత రానుంది.

మరోవైపు ఇప్పటివరకు మొదటి లిస్ట్‌లో సినీ ప్రముఖులను విచారించిన సిట్.. రెండో లిస్ట్‌లోని ప్రముఖులకు నోటీసులు పంపడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో మ‌రికొంత‌మంది సినీ ప్ర‌ముఖుల‌తోపాటు, రాజ‌కీయ వ్యాపార రంగాల‌కు చెందిన పుత్ర‌ర‌త్నాలు కూడా ఉన్నార‌నే వార్తలు ఈ మ‌ధ్య జోరుగా వినిపించాయి. జాబితా అయితే సిద్ధంగా ఉంది కానీ నోటీసులు జారీ చెయ్యడం విషయం లోనే సిట్ వెనక అడుగు వేస్తోంది. మొదటి సిట్ లిస్ట్‌లో పేర్లు భయట పెట్టినప్పుడు మీడియా పెద్దెత్తున కవరేజీ చేసింది. జూలై 19 న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కేసుతో మొదలైన మీడియా హడావిడి నందు విచారణ వరకూ ఆగలేదు.

ఇప్పుడు రెండో లిస్ట్‌లో తమ పేర్లుంటే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు సినిమా ప్రముఖులు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం… రెండో జాబితాలో రాజ‌కీయ‌, వ్యాపార రంగాల‌కు చెందిన పెద్ద త‌ల‌కాయలే ఉన్నాయ‌నీ, వారి పేర్ల‌ను బ‌య‌ట‌కి తేవొద్దంటూ కొంత‌మంది సినీ ‘పెద్ద‌లు’ అధికారుల‌ను ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు ఈ విచారణ కూడా రహస్యంగా చేయాలని రాజకీయంగా కూడా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

- Advertisement -