అదానీ గ్రూపు సంస్థ అధినేత గౌతం అదానీకి షాక్ తగిలింది. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియన్ల డాలర్లు సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో.. అదానీ గ్రూపు ఆ ప్లాన్‌ను రద్దు చేసింది.
20 ఏళ్లలో దాదాపు రెండు బిలియన్ల డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు గౌతం అదానీతో పాటు మరో ఏడు మంది ముడుపులు ఇవ్వచూపినట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ ఆ అభియోగాలు చేసింది.
Also Read:TTD:శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల