- Advertisement -
గత కొద్ది రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా దిగివచ్చాయి. గత నెల 12వ తేదీ నుంచి ధరలు తగ్గడం ప్రారంభం కాగా, ఫిబ్రవరి నెలలోనే లీటరు పెట్రోలుపై 82 పైసలు, డీజిల్ పై 85 పైసల మేరకు ధర తగ్గింది. తాజాగా పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 27 పైసల మేరకు ధర తగ్గించినట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ. 72.45కి దిగిరాగా, డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ. 65.43కి చేరుకున్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.34 నుంచి రూ.78.11కి తగ్గగా, డీజిల్ రూ.68.84 నుంచి రూ.68.57కి దిగొచ్చింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు తగ్గి రూ.77.08కి చేరుకోగా, అలాగే డీజిల్ ధర 28 పైసలు తగ్గి రూ.71.35గా నమోదైంది. ఆయా నగరాల్లో విధిస్తున్న పన్నుల ఆధారంగా ధరలు మరింత తగ్గనున్నాయి.
- Advertisement -