ప్రకృతి ప్రేమికులు మొక్కలు నాటి తమ ప్రేమను చాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ వాసంతి.
ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.మొక్కలు అంటే ప్రాణం అని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే ఇంత మంచి కార్యక్రమం తోనే లైఫ్ స్టార్ట్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
మనమందరం చెట్లను నరకకుండా వీలైనంత వరకు మొక్కలు నాటితే మనకే కాకుండా భావితరాలకు మంచి చేసినవారిమి అవుతాము అన్నారు.ఇంత గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బిగ్ బాస్ హౌస్ నుండి రాగానే ఇనాయ మరియు కీర్తి వీరిని కూడా ఈ కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటాలని సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి..