బిగ్ బాస్‌ 94 ఎపిసోడ్‌..ఫైనల్‌కి రాహుల్‌

559
big boss 3
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 3 విజయవంతంగా 94వ ఎపిసోడ్‌ని పూర్తిచేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్,అలీకి బురద టాస్క్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. వీరిద్దరికి ఒక మడ్ పిట్, రెండు రకాల పూలు ఉంచారు. ఒక్కొక్కరూ ఒక్కో రకం పూలు ఎంచుకోవాలని చెప్పారు. బజర్ మోగగానే ఎవరికి వారు తమ పూలను ఆ బురద మట్టిలో నిలబెట్టాలి. ఎండ్ బెల్ మోగిన సమయానికి మడ్ పిట్‌లో ఎవరి పూలయితే ఎక్కువగా ఉంటాయో వారు గెలిచినట్టు.

ఇక ఈ టాస్క్‌లో గెలిచేందుకు బాబా, అలీలు కొట్టుకున్న తీరు హింసాత్మకంగా మారింది. దీంతో వీరిద్దరిని హెచ్చరించారు బిగ్ బాస్. అయితే అలీ, బాబాలు మాత్రం వెనక్కితగ్గలేదు. ప్రాణం పోయినా పర్లేదు అనుకునేలా ఇద్దరు పోరాడుతుండటంతో ఈ టాస్క్‌ని రద్దు చేశారు బిగ్ బాస్. అలీని హెచ్చరిస్తూ…. టిక్కెట్ టు ఫినాలే టాస్క్‌ నుండి తప్పించారు.

ఈ టాస్క్‌లో భాగంగా రాహుల్‌ విజేతగా నిలిచాడు.దీంతో బిగ్ బాస్ సీజన్ 3లో ఫైనల్‌కి వెళ్లిన తొలి కంటెస్టెంట్ అయ్యాడు. మిగిలిన వరుణ్, అలీ, శ్రీముఖి, బాబా, శ్రీముఖి, శివజ్యోతిలు ఈవారం నామినేషన్స్‌లో నిలిచారు. ఈ ఐదుగురిలో ఒకరు ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి బ్యాగ్ సర్దేయనున్నారు.

- Advertisement -