అమితాబ్ ఆ ఉత్పత్తులకు ప్రచారం చేయరట..!

166
Amitabh Bachchan

తాను ఏ ఉత్పత్తులనైతే వాడతానో, వాటికే ప్రచారం చేస్తానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. మద్యం, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులకు తాను ప్రచారకర్తగా వ్యవహరించనని అమితాబ్‌ బచ్చన్ తెలిపారు‌. మహారాష్ట్రలో నిర్వహించిన ‘క్యూరియస్‌ క్రియేటివ్‌ అవార్డ్స్‌’ కార్యక్రమంలో అమితాబ్‌ అవార్డు అందుకున్నారు.

Amitabh Bachchan

ఈ కార్యక్రమంలో అమితాబ్‌ మాట్లాడుతూ..మద్యం, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులకు తాను ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాసడర్ గా ఉండనని చెప్పారు. తనకు ఏదైనా ఉత్పత్తి నచ్చి, దాన్ని తాను కూడా వాడగలననే నమ్మకం ఏర్పడితేనే ప్రచారకర్తగా వ్యవహరిస్తానని తెలిపారు. ఎందుకంటే నేను మద్యం, పొగాకుకు దూరంగా ఉంటాను. నేను ఈ అవార్డుకు అర్హుడినో కాదో తెలీదు కానీ ప్రకటన రంగంలో నేను చేస్తున్న పనిని గుర్తించి నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల అమితాబ్‌, రిషి కపూర్‌ నటించిన ‘102 నాటౌట్‌’ చిత్రం విడుదలై ఘన విజయం అందుకుంది. ప్రస్తుతం అమితాబ్‌ ‘బ్రహ్మాస్త్రా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, చిరంజీవి ‘సైరా’ చిత్రంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.