హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరా బంద్

4
- Advertisement -

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా నీటి సరఫరా ఫేజ్-3లోని 2375 ఎంఎం డయామీటర్ ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో లీకేజీ ఏర్పడింది. దీంతో లీకేజీ సమస్యను పరిష్కరించడానికి మరమ్మతు పనులు చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 24వ తేదీన ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతు పనులు నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది.

నీటి పైపు మరమ్మతుల కారణంగా ఈ 24 గంటలు ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. మరి నీటి సరఫరా బంద్ అయ్యే ప్రాంతాలేంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్‌లోని శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్ నగర్, తట్టి ఖానా, లాలాపేట్, సైనిక్‌పురి, మౌలా అలీ, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరీ హిల్స్, వాసవీ నగర్, బద్లానగర్, సులేమాన్.

Also Read:కలబందతో..నిగారింపు సొంతం!

- Advertisement -