Joe Biden: అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న బైడెన్

28
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్. అధ్యక్ష రేసు నుండి తప్పుకున్నారు జో బైడెన్. పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కమలా హారిస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బైడెన్ పోటీకి సంబంధించి సొంత పార్టీ నేతల నుంచే తీవ్రంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో తప్పుకున్నట్లు ప్రకటించగా పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇక జో బైడెన్ రేసు నుండి తప్పుకోగా కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో స్పందించారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. బైడెన్‌ కంటే కమలా హారిస్‌ ను ఓడించడం ఇంకా సులభమని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్‌ అని విమర్శలు చేశారు. మీడియా, వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసు అని చురకలు అంటించారు ట్రంప్.

ఇక బైడెన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకోవడానికి ఆయన వ్యవహార శైలే కారణం. ప్రధానంగా మాటల తడబాటుతో ఆయన తీవ్ర విమర్శల పాలయ్యారు. తన పక్కనే ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ప్రెసిడెంట్‌ పుతిన్‌ గా సంబోధించారు. ఆ తర్వాత ఆమెకు అధ్యక్షురాలయ్యే అర్హత లేదని నేను అనుకొని ఉంటే ట్రంప్‌ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసి ఉండను అని అన్నారు.

Also Read:Elon Musk: ఏఐ ఫ్యాషన్ షో, మస్క్‌ ట్వీట్‌ వైరల్

- Advertisement -