బిడ్డ పుట్టిన వెంటనే ఎందుకు రీఎంట్రీ అంటే !

83
- Advertisement -

చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్‌ కొడుక్కి ‘నీల్ కిచ్లు’ అని పేరు కూడా పెట్టారు. అసలు పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్ గా కొనసాగడం సాధారణ విషయమేమీ కాదు. సహజంగా పెళ్లి అయిన భామలను ప్రేక్షకులు ఆదరించరు. నిర్మాతలు, దర్శకులు కూడా వారిని ఫేడ్ అవుట్ లిస్ట్ లో పడేస్తారు. ఐతే, పెళ్లి అయి, తల్లి అయిన కాజల్ అగర్వాల్ కి మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాజల్ అగర్వాల్ కి ప్రస్తుతం వరుస సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే శంకర్ – కమల్ హాసన్ కలయికలో వస్తున్న ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి – బాలయ్య బాబు కలయికలో రాబోతున్న మాస్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ లో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్. ఈ ప్రాజెక్టులో బాలయ్య ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి టీం చాలా పేర్లను పరిశీలించి చివరకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకుంది. ఈ సినిమాలతో పాటు కాజల్ అగర్వాల్ ఓ తమిళ సినిమా కూడా చేస్తోంది. అలాగే ఓ హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అయితే, తాను నటిగా ఫుల్ బిజీగా ఉండటం పై తాజాగా కాజల్ అగర్వాల్ వివరణ ఇచ్చింది.

ఇంతకీ కాజల్ అగర్వాల్ ఏం మాట్లాడింది అంటే.. నేను బిడ్డకు జన్మనిచ్చిన 3 నెలలకే రీఎంట్రీ ఇచ్చాను. కేవలం నటనపై ఉన్న ఇష్టంతోనే తొందరగా రీఎంట్రీ ఇచ్చాను. ‘నా కుమారుడిని నా తల్లి చూసుకుంటారు. అందుకే నేను కెమెరా ముందు ఎలాంటి టెన్షన్ లేకుండా నటించగలుగుతున్నాను’ అని కాజల్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి…

ఆర్య…సర్పట్ట రెండవ పార్టు

విమర్శలు చేసి వెనక్కితీసుకోకపోతే ఎలా ?

పిక్ టాక్ : ఫుల్ హాట్.. ఫీల్ ఔట్ ఫిట్

- Advertisement -