సలీం సినిమాతో ప్రేక్షకుల్లో మంచిపేరు సంపాదించుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై నటుడిగా బిజీగా మారిపోయాడు. బిచ్చగాడితో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీని షేక్ చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీతో రెండు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
అయితే తర్వాత రెండు,మూడు సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టాయి. అయినా వెనక్కి తగ్గని విజయ్ తాజాగా ఏకంగా 13 సినిమాలను లైన్లో పెట్టేశాడు.శుక్రవారం విజయ్ నటించిన కిల్లర్ విడుదలకు సిద్ధం కానుండగా ఈ సందర్భంగా తన నెక్ట్స్ సినిమాల గురించి చెప్పి అందరికి షాకిచ్చాడు.
ఈ సినిమా తర్వాత జ్వాల అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నానని తెలిపారు విజయ్. దీంతో పాటు ఆనంద్,సెంథిల్ అనే దర్శకులతో సినిమాలు చేస్తున్నానని అవి ఈ సంవత్సరమే మొదలు కానున్నాయని తెలిపారు. దీంతో పాటు మరో 10 సినిమాలు ఒప్పుకున్నానని తెలిపారు. ఇప్పటివరకు తన సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తూ వచ్చానని తెలిపిన విజయ్..ఇప్పుడు ఇతర నిర్మాతలకు అవకాశాలు కల్పిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మొత్తంగా రానున్న నాలుగు సంవత్సరాలు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేయనున్నాడు విజయ్.