బాహుబలికి బిచ్చగాడు షాక్..!

258
Bichagadu breaks Baahubali record
- Advertisement -

కథ బలం ఉంటే ఎలాంటి సినిమాలైనా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనడానికి బిచ్చగాడు మూవీనే ఓ ఉదాహరణ. డబ్బింగ్ సినిమాగా తెలుగులో విడుదలైన బిచ్చగాడు మూవీ అనూహ్యంగా 15 కోట్లు రాబట్టి టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ మూవీ తిమిళనాట టీవీ ఛానల్ లో ప్రీమియర్ షోగా ప్రసారమై, సీని వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది.

ఇండియన్ సినిమాల హిస్టరీలోనే చరిత్రసృష్టించిన బాహుబలి ప్రీమియర్ రేటింగ్స్ ను పిచ్చైక్కారన్ బ్రేక్ చేశాడు. బాహుబలి మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో అదే స్థాయిలో బుల్లితెరపై అత్యధిక ప్రీమియర్ షో రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. బాహుబలి రేటింగ్స్ అధిగమించాలంటే.. అంతేస్థాయి భారీ చిత్రం ద్వారానే అది సాధ్యం అనుకున్నారంతా. కానీ, చిన్న చిత్రంగా విడుదలై అనూహ్య విజయం సాధించిన పిచ్చైక్కారన్.. అంతకు మించిన స్థాయిలో బుల్లితెరపై హిట్ అయ్యింది.

బిచ్చాగాడు కొట్టిన దెబ్బకు ఇప్పటి వరకు బుల్లితెరపై ఉన్న అన్నితుడిచిపెట్టుకుపోయాయి.టీవీ రేటింగ్ లో ఈ మూవీకే టాప్ రేటింగ్ వ‌చ్చింది. దీంతో ఆల్ టైం దక్షిణాది టీవీ ప్రీమియర్ రేటింగ్స్ ను పిచ్చైక్కారన్ సొంతం చేసుకుని, బాహుబలి బిగినింగ్ ని రెండవ స్థానానికి నెట్టింది.

- Advertisement -