బిచ్చగాడు 3..అప్‌డేట్!

7
- Advertisement -

విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు (తమిళంలో పిచైక్కారన్) సినిమా తెలుగులో ఘనవిజయం సాధించింది. తమిళంలో కంటే తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌కి అత్యద్భుతమైన స్పందన లభించింది.

దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు 2 / పిచైక్కారన్ 2ను తెరకెక్కించారు విజయ్. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ తానే దర్శకుడిగా వ్యవహరించారు. రెండో భాగం కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్ పాపులారిటీపై ఆధారపడుతూ విజయ్ ఆంటోనీ ఇప్పటికే బిచ్చగాడు 3ను ప్రకటించారు.

తన రాబోయే చిత్రం మార్గన్ ప్రమోషన్‌ల సమయంలో విజయ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, బిచ్చగాడు 3 2027 సమ్మర్‌లో విడుదల కాబోతుంది. ఇందులో ఆయన మరోసారి దర్శకుడిగా మరియు హీరోగా పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read:NHAI:టూ వీలర్ వాహనాలకు టోల్ లేదు

- Advertisement -