గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు

667
dsp
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు డీఎస్పీ సంపత్ రావు. ఈరోజు ఉదయం డిఎస్పీ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా డీఎస్పీ సంపత్ రావు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. . రాబోయే తరానికి కావాల్సిన ఆక్సిజన్ కావాలి అంటే యువతరం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఛాలెంజ్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటిన గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ఇండియా ని గ్రీన్ ఇండియా గా మార్చవచ్చు అని చెప్పారు.

dsp

ఎంపీ సంతోష్ కుమార్ , సీఎం కేసీఆర్ హారితహరంకి మద్దతు గా గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ఇప్పటికే నాలుగు కోట్ల మొక్కలు నాటిన సంతోష్ కుమార్ 10 కోట్లు మొక్కలు నాటే వరకు మా వంతు సహకారం అందిస్తామని , నాటిన ప్రతి మొక్క ఎదిగి ఎంతవరకు బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి ఆర్టీసీ డిఎం లక్ష్మి ధర్మ,, చిట్యాల సిఐ సాయి రమణ ,రేగొండ ఇంచార్జ్ బాలస్వామి ఐపీఎస్ లకు మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.

- Advertisement -